బంగినపల్లి: తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. దాదాపు వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడి రకాలను తెలుగునాట సాగు చేస్తున్నారు.
అల్ఫోన్సో: పండ్లకు మామిడి రారాజు అయితే.. మామిడిని పండ్లలోనే రారాజుగా పేరుగాంచింది అల్ఫోన్సో. రుచి, సువాసన కారణంగా చాలా ప్రజాదరణ పొందింన ఈ మామిడి ఆరోగ్యానికి కూడా మేలైనదే. ఇంకా ఈ పండు ప్రత్యేకమైన సువాసన, ఆకర్షణీయమైన కుంకుమ రంగును కలిగి ఉంటుంది.
కీసర్: స్వీట్లలో ఎక్కువగా ఉపయోగించే కీసర్ మామిడి పండును గుజరాత్‌లో ఎక్కువగా పండిస్తారు.
తోతాపురి: ఆకారంలో పెద్దగా ఉండే ఈ పండు పచ్చళ్లు, చట్నీల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు.
లాంగ్రా: పశ్చిమ బెంగాల్, బీహార్‌లో లాంగ్రా అత్యంత ప్రాచుర్యం పొందిన మామిడి రకం. ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
దాశేరి: ఈ దాశేరి మామిడి పండును ఐస్ క్రీమ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండు ఉత్తరప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా సాగులోకి వచ్చింది.
చౌసా: ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో ఎక్కువగా పండించే చౌసా రకం మామిడి, దాని రుచి కారణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందింది.