
నడక సహా రెగ్యులర్ శారీరక కార్యక్రమాలు మెరుగైన నిద్రను పొందడంలో సాయం చేస్తాయి. నిద్ర విధానాలను నియంత్రించడంతో పాటు ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

నడక శ్వాసకోశ కండరాలను బలపరుస్తుంది. అందువల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుఅవుతుంది. మెరుగైన ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పని తీరును ప్రోత్సహిస్తుంది.

నడక ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. వీటిని ఫీల్‌గుడ్ హార్మోన్లు కింద పేర్కొంటారు. ఇది ఒత్తిడి, నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సాయం చేస్తుంది.

Walking

నడక అనేది క్యాలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి చక్కటి మార్గం. సమతుల్య ఆహార విధానాన్ని పాటించడం ద్వారా బరువు తగ్గడం సాధ్యం అవుతుంది. దీనికి శారీరక వ్యాయామం కింద నడకను జోడించాల్సి ఉంటుంది.

రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి హృదయ ఆరోగ్యం మెరుగుఅవుతుంది. మెరుగైన రక్తపోటు, కొలెస్ట్రాల్ నిర్వహణకు సాయం చేస్తుంది.