
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు, బంధాలు, బంధుత్వాలు, సక్సెస్, లక్కు, ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన డబ్బు ప్రాముఖ్యత గురించి తెలియజేశాడు.

ఎప్పుడు కూడా మనం సంపాదించేదాంట్లో కొంత శాతం మన అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. ఆయన మాట్లాడుతూ, ధనవంతుడు ఎక్కడుంటాడు.డబ్బు దాచుకున్న వాడే నిజమైన ధనవంతుడు. లక్ష్మి.. సంపద చంచలమైనది. అది ఎప్పుడు పోతుందో, ఊహించడం చాలా కష్టం. కొన్ని సార్లు కొండలా కూడ బెట్టింది కూడా పోతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.

ధనవంతుడు ఎంత సంపద కలిగిఉన్నా దురదృష్టకర సమయాల్లో అన్నీ కోల్పోవచ్చును. లక్ష్మీ స్వాభావరీత్యా చంచలమైనది. ఆమె ఎల్లప్పుడూ మీతో ఉంటుందని ఎటువంటి హామీ లేదు కాబట్టి. సంపదను ఈరోజు మాత్రమే కాకుండా, భవిష్యత్తు అనిశ్చితుల కోసం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నాడు.

ప్రతి రోజూ కొంత డబ్బు ఆదా చేసి, అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టుకోవాలి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అనవసర ఖర్చులను నివారించి, డబ్బును సురక్షితంగా తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించుకోవాలని, అలాగే భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళిక కోసం రూపొందించుకొని, ఆర్థిక భద్రత కోసం కాపాడుకోవాలని ఆయన తెలియజేయడం జరిగింది.