3 / 5
ఒకసారి గర్భస్రావం జరిగితే, సమస్యలు పెరుగుతాయి. మరోసారి కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యుల సలహాలు పాటించాలి. కోవిడ్ అనంతర కాలంలో మహిళల్లో అనేక సమస్యలు పెరుగుతున్నాయి. వీటిలో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. థైరాయిడ్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ సమస్యలు గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మీరు గర్భం దాల్చాలని ఆలోచిస్తున్నట్లయితే మొదటి నుంచి ఈ రెండు హార్మోన్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.