Enemy of snakes: ముంగూస్ కాదు.. ఇదే పాముకు బద్ధ శత్రువు.. ఈ పెట్‌ మీ ఇంట్లో ఉంటే.. సర్పాలకు దడే!

Updated on: Nov 16, 2025 | 2:46 PM

పాములకు శత్రువు అనగానే గుర్తొచ్చే మొదటి జంతువుల 'ముంగూస్'.. కానీ ఇదే నిజమనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే చాలా మందికి తెలియని వాస్తవం ఏమిటంటే.. పాముకు ముంగూస్ కన్నా.. బద్ద శత్రువు ఒకటి ఉంది.. దీన్ని కొందరు పెంపుడు జంతువుగా కూడా పెంచుకుంటారు. అదే చాలా ఇళ్లలో తరచూ కనిపించే పిల్లి. అవునూ ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమని అంటున్నారు కొందరు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది.

1 / 6
 భారతదేశంలోని గ్రామాలు, పట్టణాలలో పిల్లులు, పాములు పోరాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు నెటిజన్లలో ఉత్సుకతను రేకెత్తించడమే కాకుండా, ఈ రెండు జీవులు వాస్తవ ప్రపంచంలో ఎదురైతే ఎలా ఉంటుందనే ప్రశ్నను కూడా లేవనెత్తాయి.

2 / 6
పిల్లులు సహజంగా చాలా చురుకైనవి. ఈ లక్షణం పెంపుడు పిల్లులలో కూడా ఉంటుంది. అవి తమ చుట్టూ ఉన్న కదలికలను చాలా వేగంగా గమనిస్తాయి. అలాగే ఏదైనా ప్రమాదకర ఆకారాన్ని చేస్తే తక్షణమే అప్రమత్తమవుతాయి. అవసరమైనప్పుడు వాటిపై దాడి చేసే సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది. పాములు కూడా వేటాడే తత్వం కలిగి ఉన్నప్పటికీ ఇవి పిల్లుల కంటే నెమ్మదిగా ఉంటాయి.

3 / 6
పిల్లులకు ఉండే ప్రధాన బలం వాటి చురుకుదనం. అవి పాము దాడి నుండి క్షణంలో తప్పించుకోగలవు. పిల్లులు ఒకే జంప్‌లో వెనక్కి, పక్కకు కదలం చేయగలవు. అలాగే క్షణాల్లో తన స్థానాన్ని మార్చగలవు.. ఈ ఊహించని కదలికలు పామును భయపెట్టిడమే కాకుండా..వాటిని కరవడానికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వవు.

4 / 6
పాములు సాధారణంగా నేరుగా దాడి చేస్తాయి. కానీ పిల్లి శరీర కదలికలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. వివిధ కోణాల నుండి దాడి చేయడం వీటి ప్రత్యేక, వెనుకకు కదలడం, ముందుకు దూకడం ద్వారా పాము తన లక్ష్యాన్ని సరిగ్గా టార్గెట్ చేయలేదు. పిల్లి మీసాలు, కళ్ళు, చెవులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి, అవి దగ్గరి కదలికను కూడా సులభంగా గుర్తించగలవు.

5 / 6
 ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాముల బలం వాటి విషపూరిత కాటులోనే ఉంటుంది. కానీ పిల్లికి దాని గోళ్లు, దంతాలు గొప్ప ఆయుధాలు. ఒక వేళ పిల్లి పాము తలపై దాడి చేస్తే, పాము తనను తాను రక్షించుకోవడం చాలా కష్టం. పిల్లి, పాము కొట్లాలినప్పుడు పిల్లి వేగం, చురుకుదనం చూసి పాములు వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి.

6 / 6
మొత్తం మీద, పాములు పిల్లులకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నప్పటికీ, పిల్లి చురుకుదనం, చురుకైన ఇంద్రియాలు, పదునైన గోళ్లు దానిని పాముకి ప్రధాన శత్రువుగా మారుస్తున్నాయి. అందుకే వీడియోలలో పిల్లుల నుండి పాములు పారిపోవడాన్ని మనం తరచూ చూడవచ్చు. (Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని మేము దృవీకరించలేదు)