
క్యారెట్లను విటమిన్ ఎ (బీటా-కెరోటిన్), విటమిన్ కె1, పొటాషియం, ఫైబర్‌కు అద్భుతమైన మూలంగా భావిస్తారు. దానితో పాటు వాటిలో విటమిన్ బి6, విటమిన్ సి, బయోటిన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా మనకు ఆనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ, బీటా-కెరోటిన్ మన కంచిచూపును మెరుచేందుకు సహయపడుతాయి. అలాగే మన కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు క్యారెట్లలో ఉంటే పొటాషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా తోల్పడుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.

ఇక ముల్లంగి విషయానికి వస్తే ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ముల్లంగిలో ఉండే విటమిన్ సి జలుబు, దగ్గుతో పోరాడటానికి సహాయపడుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు ముల్లంగిలో అధిక నీటి శాతం ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఎముకలను బలపరిచే కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల, రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఇక మన ఆరోగ్యానికి రెండింటిలో ఏ ఉత్తమైనది అనే విషయానికి వస్తే .. మీరు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంటే, లేదీ మీకు విటమిన్ ఎ అవసరం ఎక్కువగా ఉంటే మీరు క్యారెట్లు తీసుకొవచ్చి. అలా కాకుండా మీకు మీ జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, విటమిన్ సి, మలబద్ధకం సంబంధిత సమస్యలు తొలగిపోవాలన్నా ముల్లంగి తీసుకోండి. కాబట్టి రెండింటిలో ఏంది ఉత్తమం అనేది మీ అవసరాలను బట్టి మారుతుంది