Heart Care: ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. లేకపోతే మీ చిట్టి గుండె ఆగిపోతుంది జాగ్రత్త..

Updated on: Oct 25, 2025 | 2:29 PM

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే. గుండె సమస్యలను ముందుగా గుర్తిస్తే వాటిని అదుపు చేయవచ్చని అమెరికన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇవాన్ లెవిన్ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నామని భావించే వారు కూడా గుండె జబ్బులను సూచించే కొన్ని కీలక లక్షణాలను అస్సలు విస్మరించకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బు ముఖ్య లక్షణాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
ఛాతీపై ఒత్తిడి: ఇది గుండె జబ్బులకు ప్రధాన సూచిక. ఛాతీ ప్రాంతంలో బిగుతు, భారం, పిండడం లేదా నొక్కిన ఫీలింగ్ కలుగుతుంది. దీనిని తరచుగా "ఛాతీపై ఏనుగు కూర్చున్నట్లు" అనే భావనతో పోలుస్తారు. ఈ ఒత్తిడి నడిచేటప్పుడు పని చేసేటప్పుడు లేదా విశ్రాంతి సమయంలో కూడా రావచ్చు. ఈ నొప్పి చేతులు, భుజం, దవడకు కూడా వ్యాపించవచ్చు.

2 / 5
శ్వాస ఆడకపోవడం: కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారు ఛాతీ ఒత్తిడి లేకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ధమనులు ఇరుకుగా మారడం వల్ల గుండె కండరాలకు తగినంత రక్తం సరఫరా కాకపోవడం దీనికి కారణం. శారీరక శ్రమ చేసినప్పుడు ఈ లక్షణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

3 / 5
మహిళల్లో అసాధారణ లక్షణాలు: గుండె జబ్బు ఉన్న మహిళల్లో, పురుషుల కంటే భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే అవకాశం ఉంది. తక్కువ శ్రమ చేసినా త్వరగా, ఎక్కువగా అలసిపోవడం. కడుపులో తిప్పినట్లు అనిపించడం. ఇది జీర్ణ సమస్యలా అనిపించినా ఇతర ప్రమాద కారకాలతో కలిసినప్పుడు ఇది గుండె సమస్య అయి ఉండవచ్చు. స్థిరంగా గుండెల్లో మంట ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్లే గుండె జబ్బులు వస్తాయని డాక్టర్ లెవిన్ తెలిపారు. సరైన జీవనశైలితో వీటిని నివారించవచ్చని ఆయన సూచించారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినడం, అలాగే ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులను తగ్గించడం. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం.
 పొగాకు వాడకం తగ్గించడం చేయాలి

ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్లే గుండె జబ్బులు వస్తాయని డాక్టర్ లెవిన్ తెలిపారు. సరైన జీవనశైలితో వీటిని నివారించవచ్చని ఆయన సూచించారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినడం, అలాగే ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులను తగ్గించడం. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం. పొగాకు వాడకం తగ్గించడం చేయాలి

5 / 5
సరైన నిద్ర, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం. రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం ద్వారా సమస్యను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. ఎవరూ గుండెపోటుతో చనిపోకూడదు డాక్టర్ లెవిన్ అన్నారు. చిన్న చిన్న జీవనశైలి మార్పులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, మెరుగైన ఆయుర్దాయాన్ని ఇస్తాయని చెప్పారు.