Cancer-Fighting Foods: జీవితంలో క్యాన్సర్‌ ముప్పు తలెత్తకుండా నివారించే అద్భుత ఆహారాలు.. తప్పక తీసుకోండి

|

Jul 17, 2024 | 12:29 PM

నేటి కాలంలో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు అధికంగా పెరుగుతోంది. క్యాన్సర్‌కు గత కారణాల్లో ఒకటి జన్యుశాస్త్రం అయితే, మరొక కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జన్యుపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జీవనశైలిని నియంత్రించడం ద్వారా క్యాన్సర్ ముప్పును చాలా వరకు నియంత్రించవచ్చంటున్నారు..

1 / 5
నేటి కాలంలో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు అధికంగా పెరుగుతోంది. క్యాన్సర్‌కు గత కారణాల్లో ఒకటి జన్యుశాస్త్రం అయితే, మరొక కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జన్యుపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జీవనశైలిని నియంత్రించడం ద్వారా క్యాన్సర్ ముప్పును చాలా వరకు నియంత్రించవచ్చంటున్నారు.

2 / 5
ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు, మసాలాలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల జన్యుపరమైన కారణం లేకుంటే రోజూ ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
అల్లంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎన్నోరకాలుగా సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ జీవనశైలిలో అల్లం టీ తాగడం లేదా వంటలలో అల్లం ఉపయోగించడం వంటివి చేయాలి.పసుపు వంట రుచిని మెరుగుపరచడం నుంచి చర్మ సమస్యల నివారణ వరకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. పసుపును వివిధ ఇన్ఫెక్షన్లకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కర్కుమిన్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.

4 / 5
సెలీనియం సమ్మేళనాలు క్యాన్సర్‌ను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది ట్యూనా, సాల్మన్, రొయ్యలు, చికెన్, గుడ్లు, పొద్దుతిరుగుడు గింజలు, సముద్ర చేపలలో సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి వీటిని ఆహారంలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

5 / 5
క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో మద్యం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇవి ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆహారం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.