2 / 5
రొట్టెలు, పుల్కా వంటివి చాలా మంది ఎక్కువ మంటపై కాలుస్తుంటారు. కానీ, ఇలా కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. మంటను తగ్గించి.. రొట్టెలను తరచూ తిప్పడం వల్ల అవి ఎక్కువ కాలకుండా, మాడకుండా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ మాడితే తినేముందు నల్లగా మారిన ప్రాంతాలను తొలగించాలని సూచిస్తున్నారు.