
ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగితే మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ మనస్సును ఉల్లాసపరుస్తుంది. ఇంకా చురుకుగా చేస్తుంది.. అందుకే.. చాలా మంది.. తల నొప్పి ఉన్నా.. అలసటగా ఉన్నా కాఫీ తాగుతారు.. అయితే.. కొందరికి కాఫీ తాగుతూ బ్రెడ్, బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. మరికొందరు రకరకాల స్నాక్స్ తింటారు. అయితే.. కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. వీటి కలయిక వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. కాఫీతోపాటు ఎలాంటి పదార్థాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

వేయించిన ఆహారాలు: సాధారణంగా వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీ తాగుతూ వీటిని తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. వేయించిన ఆహారం-కాఫీ కలయిక డైస్లిపిడెమియా ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తప్రవాహంలో కొవ్వు అసాధారణ స్థాయిలను డైస్లిపిడెమియా అంటారు. ఫ్రైడ్‌ఫుడ్స్-కాఫీ కాంబినేషన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనిని తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అని కూడా అంటారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే హై డెన్సిటీ లిపోప్రొటీన్ అనే మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

Coffee

తృణధాన్యాలు: తృణధాన్యాలు అల్పాహారంగా తింటారు.. ఇది ఖనిజాలు, విటమిన్లు, పోషకాలను అందిస్తుంది. అయితే వాటిని కాఫీ తాగేటప్పుడు మాత్రం తినకూడదు. తృణధాన్యాలలో జింక్ ఉంటుంది. వీటిని కాఫీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో జింక్ శోషణ తగ్గుతుంది. ఫలితంగా, జింక్ లోపం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఉప్పగా ఉండే ఆహారాలు: సోడియం అధికంగా ఉండే ఉప్పు ఆహారాలు రక్తపోటును పెంచుతాయి.. ఇంకా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రక్తపోటు స్థాయిలను నేరుగా ప్రభావితం చేసే కొన్ని సమ్మేళనాలను కాఫీ కలిగి ఉంటుంది. అందుకే కాఫీతో పాటు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఈ కలయిక అధిక బీపీని కలిగిస్తుంది.. దీర్ఘకాలంలో గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సిట్రస్ పండ్లు: కాఫీ సహజంగా ఆమ్ల (పుల్లని) ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దానితో పాటు, నారింజ, బీట్‌రూట్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ స్థాయి పెరుగుతుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)కి దారి తీస్తుంది. ఫలితంగా, ఇది జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి దారితీస్తుంది. పెరిగిన ఆమ్లత్వం కడుపు లైనింగ్‌ను చికాకుపెడుతుంది. అందుకే కాఫీ తాగేటప్పుడు సిట్రస్ పండ్లను తినకూడదు.