కిర్రాక్ ఫీచర్లు, అదిరిపోయే రేంజ్.. ఈ 3 బైక్స్‌కు పెట్రోల్‌తో పన్లేదు.. 300 కి.మీ నాన్‌స్టాప్..

|

Apr 25, 2023 | 6:16 PM

పెట్రోల్ ధరల బాదుడికి చాలామంది ఎలక్ట్రిక్ బైకులపై మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఈ బైక్‌లలో అధిక రేంజ్, అదిరిపోయే ఫీచర్లతో కూడిన బైక్‌లు ఏంటో ఇప్పుడే తెలుసుకుందామా..!

1 / 5
కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్: ఇది దేశీయ తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఇందులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిమీ రయ్.. రయ్.. అలాగే ఈ వాహనం టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. ఇక దీని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. దీని ధర రూ. 1.85 లక్షలు.

2 / 5
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్: ఇందులో 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ 100 కిమీ కాగా.. బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ వాహనం ధర రూ. 1.5 లక్షలు.

3 / 5
 అల్ట్రావాయొలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్: ఇది రెండు వేరియంట్లలో మార్కెట్‌లో లభిస్తోంది. అవే స్టాండర్డ్, రెకాన్. వీటితో పాటు స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.

4 / 5
స్టాండర్డ్ బైక్‌లో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉండగా.. ఇది 206 కిమీ రేంజ్ అందిస్తుంది. అలాగే రెకాన్ వేరియంట్ బైక్‌లో 10.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 307 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

5 / 5
ఈ బైక్ ధర రూ. 3.8 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 152 కిమీ. అలాగే ఈ బైక్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది.