YouTube: యూట్యూబ్‌లో యాడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? స్కిప్‌ చేసేందుకు గూగుల్‌ కొత్త అప్‌డేట్‌

Updated on: Oct 13, 2024 | 5:56 PM

1 / 5
YouTubeలో ప్రకటనలను దాటవేయడానికి స్కిప్ బటన్‌పై మరిన్ని అప్‌డేట్‌ల కోసం Google సిద్ధమవుతోంది. వినియోగదారుల ఫిర్యాదులు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని యూట్యూబ్‌ కొత్త సంస్కరణలను సిద్ధం చేస్తోంది. రాబోయే అప్‌డేట్‌లలో ఈ సవరణ అమలు చేయనున్నట్లు గూగుల్‌ చెబుతోంది.

2 / 5
యాడ్ స్కిప్ బటన్ సరిగ్గా కనిపించడం లేదని చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు స్కిప్ బటన్ పూర్తిగా కనిపించకుండా పోతుందని, కొన్నిసార్లు కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత యాడ్ స్కిప్ బటన్ కనిపిస్తోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

3 / 5
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో యాడ్ స్కిప్ బటన్‌ కనిపించేలా గూగల్‌ సిద్ధమవుతోంది. ఇది ప్రకటనలను స్కిప్‌ చేయడానికి సులభతరం చేస్తుందని Google భావిస్తోంది. దీంతో వీక్షణ అనుభవం కూడా పెరుగుతుందని గూగుల్ చెబుతోంది.

4 / 5
స్కిప్‌ చేసే యాడ్స్‌ కొన్ని ఉంటే.. స్కిప్‌ చేయని యాడ్స్‌ కూడా కొన్ని ఉన్నాయి. స్కిమ్‌ చేసే ప్రకటనలు 15 నుండి 30 సెకన్ల వరకు ఉంటున్నాయి. ఈ కౌంట్‌డౌన్ ముగిసినప్పుడు స్కిప్ యాడ్ బటన్ కనిపిస్తుంది. కానీ ఈ బటన్ కనిపించడం లేదనేది ఫిర్యాదు.

5 / 5
స్కిప్ బటన్ నల్లటి చతురస్రం ద్వారా దాచి ఉంటుందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అందువల్ల, ప్రకటనను దాటవేయడం సాధ్యం కాదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యాడ్ స్కిప్ బటన్‌ను సవరించాలని గూగుల్ నిర్ణయించింది. త్వరలో ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.