
వాట్సప్ వినియోగదారులకు అలర్ట్. ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సప్ ప్లస్. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే విదేశాల్లో దీనిని తీసుకురాగా.. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రవేశపెట్టింది. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను జోడించింది.

సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి అనేక ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. యాప్ థీమ్‌ను మార్చుకునేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. స్టిక్కర్లను పంపడంతో పాటు చాట్‌లకు రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ప్రతీ ఛాట్‌కు ప్రత్యేకంగా రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇక ఏఐ జనరేటెడ్ ఎమోజీలతో పాటు కస్టమ్ చాట్ లిస్టులో ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి.

ఈ సబ్‌స్క్రిప్షన్ ధర భారత్‌లో రూ.79గా ఉంది. ముందుగా ఒక నెల ఉచిత ట్రయల్ ఉంటుంది. అనంతరం నెలకు రూ.79 బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. అండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుందని మెటా తెలిపింది. అయితే సాధారణ యూజర్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని, ఎప్పటిలాగే ఉచిత సేవలను పొందవచ్చని స్పష్టం చేసింది.

సాధారణ యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే మిగతా సేవలన్నీ అందుబాటులో ఉంటాయని మెటా తెలిపింది. ఇక సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు 20 వరకు చాట్‌లను పిన్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ప్రీమియం రింగ్ టోన్లు, స్టిక్కర్లు, యాప్ థీమ్‌లు, ఏఐ ఎమోజీలు అందుబాటులో ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్ అనేది యూజర్ అవసరమనుకుంటే స్వచ్చంధంగా తీసుకోవచ్చు.

యూజర్లకు అదనపు ఫీచర్లను అందించేందుకు వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ తెచ్చినట్లు మెటా తెలిపింది. ఇక వాట్సప్ ఐకాన్‌ను ఇతర రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇక ఛాట్ ధీమ్స్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకుంటే వాట్సప్ ప్లస్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.