
ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే మనకు గుర్తొచ్చేది మెడికల్ షాప్. వెంటనే అక్కడికి వెళ్లి మన రోగానికి సంబంధించిన ట్యాబ్లెట్ తీసుకుంటాము. ప్రతీఒక్కరూ ఒక్కరైనా మెడికల్ షాపుకు వెళ్లి ఉంటారు. దీంతో ఏదైనా బిజినెస్ పెట్టాలనుకునేవారికి మెడికల్ షాపు అనేది చాలా ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారం. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే.

మెడిసిన్స్ అనేవి ప్రతీఒక్కరికీ అవసరం గనుక ఈ బిజినెస్ మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. విధివీధిలో ఎక్కడికక్కడ మెడికల్ షాప్స్ వెలుస్తున్నాయి. మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే కొన్ని విద్యార్హతలు కూడా పూర్తి చేసి ఉండాలి. ఇవి లేకుండా మెడికల్ షాప్ పెడితే క్లోజ్ చేస్తారు.

ఫార్మసీ డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసి ఉండాలి. బీ ఫార్మసీ లేదా డిప్లోమా ఇన్ ఫార్మసీ చదివి ఉండాలి. బీ ఫార్మసీ నాలుగేళ్లు ఉంటుంది. ఇక డిప్లోమా 2 ఏళ్లు ఉంటుంది. ఈ కోర్సు సర్టిఫికేట్లు మన దగ్గర ఉంటేనే మెడికల్ షాపు పెట్టుకోవడానికి వీలవుతుంది.

ఇక మెడికల్ షాపు పెట్టుకోవడానికి ఫార్మసీ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఉండాలి. రాష్ట్ర ఫార్మసీ చట్టం కింద అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్‌తో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అందించాలి.

అలాగే మీరు పెట్టాలనుకునే స్టోర్ అడ్రస్, అద్దె వంటి వివరాలు అందించాలి. లైసెన్స్ వచ్చిన తర్వాతనే మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవాలి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆడిట్, వెరిఫికేషన్ తర్వాత మెడికల్ షాపుకు అనుమతి వస్తుంది. ఈ పర్మిషన్స్ లేకపోతే మెడికల్ షాప్ రద్దు చేస్తారు.