


క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు తనిఖీ చేసే మరో విషయం ఆదాయం. వారు చెప్పినంత ఆదాయం మీకు ఉంటేనే వారు క్రెడిట్ కార్డును ఆమోదిస్తారు. అంతేకాకుండా, సరైన ఆదాయ పత్రాలను సమర్పించడం కూడా చాలా అవసరం.

తక్కువ సమయంలో క్రెడిట్ కార్డ్ కోసం ఎక్కువ దరఖాస్తులను సమర్పించడం కూడా సరైన విధానం కాదు. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. మీరు సమర్పించే ప్రతి దరఖాస్తుకు మీ క్రెడిట్ స్కోర్‌లు తనిఖీ చేయబడతాయి. క్రెడిట్ కార్డు కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకునే ముందు ఇది వరకు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన వివరాలు కూడా అక్కడ నమోదై ఉంటాయని గుర్తించుకోండి.

వీటన్నింటితో పాటు, మీ రుణ స్థాయి కూడా పరిగణనలోకి తీసుకోవలసిన విషయం. మీ ఆదాయానికి సంబంధించి మీకు గణనీయమైన అప్పు ఉంటే, అది క్రెడిట్ కార్డులపై ప్రభావం చూపుతుంది. అప్పు-ఆదాయ నిష్పత్తి 0 కి దగ్గరగా ఉండాలి. మీ ఆదాయంతో పోలిస్తే మీ రుణ స్థాయిని వీలైనంత తక్కువగా ఉంచుకోవడం ఉత్తమం.