
ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయిలో రూ.24.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఇది గత నెలతో పోలిస్తే 12.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా తెలిపింది.

ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీ విలువ రూ.21.96 లక్షల కోట్లుగా ఉంటే మార్చిలో లావాదేవీల విలువ రూ.24.77 లక్షల కోట్లుగా నమోదైందని ఎన్‌పీసీఐ తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో రూ.19.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

2025 మార్చిలో రూ.24.8 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇవి విలువలో 25 శాతం పెరుగుదలను, పరిమాణంలో 36 శాతం వృద్ధిని నమోదు చేశాయని నిపుణులు చెబుతున్నారు.

ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీలతో పోలిస్తే సగటున రోజువారీ లావాదేవీలు రూ.79,903 కోట్లుగా నమోదయ్యాయి. ఈ డేటాను మార్చితో పోలిస్తే 1.9 శాతం పెరిగి, వాల్యూమ్‌లు 2.6 శాతం పెరిగాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి తీసుకొచ్చిన ఎన్‌పీసీఐ భారతదేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించడంతో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.