Ravi Kiran |
Oct 07, 2021 | 11:04 AM
టెస్లా కంటే తోపు ఈ కారు. త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని త్వరలోనే రిలీజ్ చేయనుంది.
ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ట్రిటాన్ సంస్థ ‘ది ట్రిటాన్ హెచ్’ పేరుతో వచ్చే వారం భారత్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మే నెల నుంచి ట్రిటాన్ హెచ్ ఎస్‌యూవీ మోడల్ ప్రీ-బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. ఈ మోడల్ కారు టెస్లాకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ కారు ఏడు కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
1,500 హర్స్‌పవర్‌ను ట్రిటాన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ కారులో 200kwh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే గరిష్టంగా 1120 కిమీ ప్రయాణం చేయొచ్చు.
రెండు గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 96 కిమీ వేగాన్ని ఈ కారు అందుకుంటుంది. అలాగే కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ను ఏర్పాటు చేశారు.
భారత్‌లో 1000 కార్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ ప్రకటించారు.
అమెరికాలో ఈ కారు ధర సుమారు రూ. 1.05 కోట్లు ఉండగా.. భారత్‌లో అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తామని అన్నారు.