
Toyota Rumion: ప్రస్తుతం ఈ టయోటా రూమియన్ దక్షిణాఫ్రికా వంటి విదేశీ మార్కెట్లలో అమ్ముడవుతోంది. భారతీయ మార్కెట్ కోసం టయోటా కంపెనీ తన రూమియన్ మోడల్‌ను కొంచెం ఆప్‌డేట్ చేసి ప్రారంభించాలని భావిస్తోంది. దీనిని టయోటా ఇన్నోవా హైక్రాస్ లాగా ఫీల్డ్ చేయవచ్చు. ఇందులో 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ని ఉపయోగించాలని భావిస్తున్నారు.

Toyota SUV Coupe: టయోటా నుంచి రాబోతున్న మరో కార్ ఎస్‌యూవీ కూపే. ఈ కొత్త కారు 2023 రెండవ త్రైమాసికంలోవిడుదల కావచ్చు.దీనిని మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించారు, ఇది త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Toyota 7-Seater SUV: కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని టయోటా కంపెనీ భావిస్తోంది. ఇది గ్లోబల్ మార్కెట్లో విక్రయించబడుతున్న కరోలా క్రాస్ SUV మూడు-రోస్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ SUV వీల్‌బేస్ పెద్దదిగా ఉండనుంది.

Next-Gen Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ అంటే భారతదేశంలోని కార్ ప్రీయులకు చాలా ఇష్టం. నివేదికల ప్రకారం ఫార్చ్యూనర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను పరిచయం చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఫుల్ సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీలకు చాలా డిమాండ్ ఉన్నందున.. టయోటా ఫార్చ్యూనర్ నుంచి వచ్చే కొత్త మోడల్ రాక అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు.

Toyota Electric SUV: టయోటా కూడా భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై కన్నేసింది. కంపెనీ టయోటా bZ4X ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టవచ్చు. నివేదికల ప్రకారం, రాబోయే SUV పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.