
Apple కొత్త, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iPhone 16 Pro Max గ్లోబల్ మార్కెట్‌లో రికార్డ్ సృష్టిస్తోంది. భారతదేశం, దుబాయ్ వంటి దేశాలలో ప్రజలు దాని ధర, లభ్యతను పోల్చి చూస్తున్నారు. దుబాయ్ దాని పన్ను-రహిత షాపింగ్‌కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను, ముఖ్యంగా ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి భారతీయులకు తరచుగా ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. దుబాయ్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర ఎంత? భారతదేశం కంటే చౌకగా ఉందా? లేక ఖరీదైనదిగా ఉందా? తెలుసుకుందాం..

దుబాయ్‌లో iPhone 16 Pro Max వివిధ వేరియంట్‌ల ధర రకరకాలుగా ఉంది. 256GB వేరియంట్ ధర సుమారు 4899 AED. అయితే దాని 512GB వేరియంట్ ధర దాదాపు 5,749 AED. 1TB వేరియంట్ ధర సుమారుగా 6,599 AED (భారత కరెన్సీలో సుమారు రూ. 1,48,000). దుబాయ్‌లో ఐఫోన్‌ల ధరలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ పన్ను రహిత వ్యవస్థ. అలాగే ఆపిల్‌కు తక్కువ దిగుమతి సుంకం ఉండటం.

ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర భారతదేశంలో దుబాయ్ కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ వివిధ వేరియంట్‌ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. 256GB వేరియంట్ ధర సుమారు రూ.1,39,900. 512GB వేరియంట్ ధర సుమారు రూ.1,59,900. 1TB వేరియంట్ ధర దాదాపు రూ.1,89,900.

భారత్‌లో ఐఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండడానికి కారణం 18% GST, ఇతర దిగుమతి సుంకాలు ఉండటం. రెండు దేశాల ధరలను పోల్చినట్లయితే, దుబాయ్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారతదేశంతో పోలిస్తే దాదాపు రూ. 20,000 నుండి 40,000 వరకు తక్కువ ధరలో ఉంది. అంటే భారత్‌నే ధర ఎక్కువగా ఉంది.

ఉదాహరణకు.. 256GB వేరియంట్ దుబాయ్‌లో దాదాపు రూ. 1,19,000కి అందుబాటులో ఉండగా, భారతదేశంలో దీని ధర రూ. 1,39,900. అదేవిధంగా 1TB వేరియంట్ దుబాయ్‌లో దాదాపు రూ.1,48,000కి అందుబాటులో ఉండగా, భారతదేశంలో దీని ధర రూ.1,89,900 ఉంది.