

సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజన (SSY) ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి మంచి ఎంపిక. కానీ ఈ పథకం ఆడపిల్లలు ఉన్నవారికి మాత్రమే. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు కుమార్తెల కోసం ప్రజలు సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం పెట్టుబడిపై 8.2% వడ్డీని అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంది. ఈ పథకంలో వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మంచి ఎంపిక. దీనిలో 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే రూ. 1,000 నుండి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల మీరు రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకం 8.2% రేటుతో వడ్డీని అందిస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రజాదరణ పొందిన, ఉత్తమ ఎంపిక. పీపీఎఫ్ పై 7.1% వడ్డీ రేటు లభిస్తోంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పీపీఎఫ్‌పై వడ్డీ రేటును సమీక్షిస్తుంది. పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
