Tata Motors Outlets: ఒకే రోజు కొత్తగా 70 ఔట్‌లెట్లను ప్రారంభించిన టాటా మోటార్స్‌..!

|

Sep 04, 2021 | 12:21 PM

Tata Motors Outlets: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణ భారత్‌లో కొత్తగా 70 ఔట్‌లెట్లను శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త విక్రయ కేంద్రాలు ..

1 / 6
Tata Motors Outlets: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దక్షిణ భారత్‌లో కొత్తగా 70 ఔట్‌లెట్లను శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త విక్రయ కేంద్రాలు దక్షిణ భారత్‌లోని 53 నగరాల్లో విస్తరించి ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

2 / 6
ప్రధానంగా దక్షిణ భారత్‌లో విస్తరణ లక్ష్యంగా ఉన్నామని తెలిపిన కంపెనీ.. ఈ సరికొత్త ఆధునిక ఔట్‌లెట్లు కొత్త ప్యాసింజర్ మోడల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను విక్రయించేందుకు ఉద్దేశించినవని వెల్లడించింది.

3 / 6
‘దక్షిణ భారత్‌లో మొత్తం పరిశ్రమ విక్రయాల్లో 28 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న మార్కెట్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా కొనసాగుతామని తెలిపింది.

4 / 6
ప్రస్తుతం తమకు ఈ ప్రాంతంలో 12.1 శాతం వాటాను కలిగి ఉన్నాం. కొత్త ఔట్‌లెట్ల ద్వారా తమ వినియోగదారులకు సులభంగా కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు రాజన్ అంబ చెప్పారు.

5 / 6
కొత్తగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో కలుపుకొని ఈ ప్రాంతంలో సంస్థకు మొత్తం 272 ఔట్‌లెట్లు ఉన్నాయి. అలాగే ఇండియా వ్యాప్తంగా మొత్తం 980 ఔట్‌లెట్లతో పాటు బెంగళూరులో 7, చెన్నైలో 5, హైదరాబాద్‌లో 4 సహా మొత్తం 32 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించామని కంపెనీ వెల్లడించింది.

6 / 6
ఆగస్టు నెలలో టాటా మోటార్స్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మొత్తం 57995 వాహనాలను విక్రయించింది. ఆగస్టు 2020 లో, కంపెనీ కేవలం 36505 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 54190 యూనిట్లుగా ఉన్నాయి. ఇది నెలవారీగా 4 శాతం, వార్షిక ప్రాతిపదికన 53 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 51 శాతం పెరిగి 28,018 యూనిట్లకు చేరుకున్నాయి, ఒక సంవత్సరం క్రితం ఇదే నెలలో 18,583 యూనిట్లు.