రూ.400 కడితే రూ.70 లక్షలు మీ సొంతం..! ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసుకోండి
సుకన్య సమృద్ధి యోజన అనేది పోస్ట్ ఆఫీసు పథకం, ఇది కుమార్తెల భవిష్యత్తుకు 8.2 శాతం వడ్డీతో రూ.70 లక్షలు వరకు సహాయపడుతుంది. పన్ను మినహాయింపుతో, రూ.250 నుండి రూ.1.50 లక్షల వరకు ఏటా పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు ఈ ఖాతాను తెరవవచ్చు.
ఈ ప్లాన్ రుణ ఎంపికలను కూడా అందిస్తుంది. మీరు మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని రుణంగా తీసుకోవాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు. మీరు సంపాదించిన వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది.
పోస్టాఫీసు ఆధ్వర్యంలో అనేక పథకాలు నడుస్తున్నాయి. ఈ పథకాలు భవిష్యత్తుపై భరోసానిస్తూ.. మంచి రాబడిని అందిస్తాయి. డబ్బులు బాగా ఆదా చేసిన తర్వాత పెట్టుబడి పెట్టడం అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే చాలా తక్కువ డబ్బుతో పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో చాలామంది పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తున్నారు.
మీ కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అందించే ఓ మంచి పోస్ట్ ఆఫీస్ పథకం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. అలాగే ఈ పథకంపై పన్ను ఉండదు. ఈ పథకం ద్వారా కేవలం రూ.400 ఆదా చేయడం ద్వారా మీరు రూ.70 లక్షలు వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
మీరు మీ కుమార్తె పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఆమె చదువు నుండి వివాహం వరకు మొత్తం ఖర్చులను ఈ పథకం ద్వారానే సాధించుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి రూ.250 నుండి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ కుమార్తె కోసం మీరు ఈ ఖాతాను తెరవవచ్చు. ఇందులో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేర్లు మీద ఖాతాను తెరవవచ్చు. ఇక కవల పిల్లలు ఉంటే ముగ్గురు అమ్మాయిల ఖాతాలను తెరవవచ్చు. ఈ ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఖాతాలో డిపాజిట్లు చేయవచ్చు. ఒకవేళ ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 ఖాతాలో మీ జమ చేయకపోతే, ఖాతా డిఫాల్ట్ అవుతుంది. దానిని 15 సంవత్సరాలలోపు మాత్రమే తిరిగి తెరిచేందుకు అవకాశం ఉంటుంది.
కుమార్తెకు 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఈ ఖాతా నుండి డబ్బును తల్లిదండ్రులు ఉపసంహరించుకోవచ్చు. ఒకేసారి లేదా సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ వాయిదాలలో దానిని ఉపసంహరించుకోవచ్చు. ఈ ఖాతా ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది.అయితే డిపాజిట్లు 15 సంవత్సరాలు మాత్రమే చేయాలి. ఇది కాకుండా.. కుమార్తెకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఆమె వివాహం సమయంలో ఈ ఫథకం మెచ్యూరిటీ పూర్తవుతుంది.
మీరు మీ కుమార్తె పేరు మీద ఈ ఖాతాను తెరిచినట్లైతే.. మెచ్యూరిటీ తర్వాత 70 లక్షల రూపాయలు కావాలనుకుందాం.. అలా కావాలంటే మొదట మీరు ప్రతిరోజూ దాదాపు రూ.400 రూపాయలు ఆదా చేయాలి. అది నెలలో రూ.12500 రూపాయలు అవుతుంది. ఏడాదికి 1.5 లక్షల రూపాయలు చొప్పున సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు జమ అవుతాయి. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు నుండి ఈ ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మెచ్యూరిటీ తర్వాత అంటే 21 సంవత్సరాల తర్వాత.. మొత్తంగా రూ. 69,27,578 మీ కుమార్తె పేరు మీద జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో మీరు 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోండి. ఇందులో వడ్డీ మాత్రమే రూ. 46,77,578 దాకా మీకు వస్తుంది. కేవంల మీరు పెట్టే పెట్టుబడి రూ. 22,50,000 అవుతుంది.