
Yono Super Savings Day: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. బ్యాంకు సేవల ద్వారా కస్టమర్లు మరింత లాభం పొందేందుకు ఎస్‌బీఐ ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి ఎన్నో రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది.

ఇక తాజాగా మరోసారి యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. కాగా, ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్ జూలై 4న ప్రారంభమైంది. ఈ సేవల్ జూలై 7 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇందులో భాగంగా టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అలాగే అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. యోనో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు పొందే అవకాశం కల్పిస్తోంది ఎస్‌బీఐ.

టాటా క్లిక్‌లో అయితే 300 రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.