New Rules: దేశంలో సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. భారీ మార్పులు ఇవే.. అసలు మిస్సవ్వకండి..

Updated on: Aug 31, 2026 | 6:56 PM

సెప్టెంబర్ 1వ తేదీ వచ్చేస్తోంది. దీంతో అనేక కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. దేశ ప్రజలను ఆర్ధికంగా ఇది ప్రభావితం చేయనున్నాయి. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వాడుతున్నా లేదా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నా.. ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే.

1 / 5
నెల మారుతుందంటే చాలు.. కొత్త నెలలో అనేక నూతన మార్పులు, నిబంధనలు, రూల్స్, ఆంక్షలు అమల్లోకి వస్తూ ఉంటాయి. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతీ నెలలాగే సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. గ్యాస్ ఎల్పీజీ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనల వరకు అనేక నిబంధనలు మారుతున్నాయి. దేశ ప్రజలందరిని ఇవి ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నాయి.

2 / 5
ఎల్పీజీ ఈకేవైసీ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. దీంతో ఇప్పటికీ పూర్తి చేయనివారికి ఈ రోజు చివరి గడువుగా చెప్పవచ్చు. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని తమ కస్టమర్లను కోరుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు సరఫరాలో అనేక అవాంతరాలు ఎదురుకావొచ్చు.

3 / 5
ఇక భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మి్గ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సెప్టెంబర్ 1 నుంచి దీనిని అమలు చేయనున్నారు. మొబైల్ ఫోన్‌లో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ బోర్డింగ్ పాస్ లేదా ప్రింటెడ్ కాపీని చూపిస్తే సరిపోతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, అంతర్జాతీయ ప్రయాణికులకు ఒక అదనపు దశను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

4 / 5
ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి ప్రతీ రోజు ఉదయం 10.10 గంటలకల్లా బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో బల్క్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను పొందుపర్చాల్సి ఉంటుంది. రూ.3 కోట్ల కంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఒకే రోజు స్వీకరించిన డిపాజిట్లపై అన్ని శాఖల్లోనూ ఒకే వడ్డీ రేట్లు ఉండాలి

5 / 5
సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ ధరల్లో సవరణలు చోటుచేసుకోనున్నాయి. కొత్త గ్యా్స్ ధరలను ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా మారనున్నాయి. ఇక బ్యాంకింగ్, ఏటీఎం ఛార్జీల విషయంలో కూడా మార్పులు జరగనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us