SBI Customers Alert: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు అమాయక ప్రజలను నిలువునా మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేస్తూ కీలక ప్రకటన చేసింది.
బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటీపీ, డెబిట్ కార్డు, పాస్‌వర్డ్, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలు ఇతరులకు షేర్ చేయవద్దని, ఎవరైన ఫోన్‌లు చేస్తూ వివరాలు చెప్పమంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని సూచించింది. వివరాలు షేర్ చేసినట్లయితే మీ ఖాతా ఖాళీ కావడం ఖాయమని హెచ్చరించింది.
మీ కేవైసీ వివరాల కోసమని ఎవరైనా ఫోన్లు చేసి వివరాలు చెప్పమంటే చెప్పవద్దని సూచించింది. బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్లు మీకు రావని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ.
మీ ఫోన్‌కు వచ్చిన లింక్‌లను క్లిక్ చేసి ఎలాంటి యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, అలా చేసినట్లయితే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే సోషల్ మీడియాలో ఆఫర్లు, డిస్కౌంట్ల పేర్లతో కనిపించే లింక్‌లను ఓపెన్ చేయవద్దని సూచిస్తోంది.