- Telugu News Photo Gallery Business photos Rainy season is a tough time for EV scooters, Follow these tips to avoid problems, EV Scooter Tips details in telugu
EV Scooter Tips: వర్షాకాలంలో ఈవీ స్కూటర్లకు గడ్డు కాలం.. ఈ టిప్స్ పాటిస్తే సమస్యలు దూరం
ప్రస్తుతం భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వరుణుడు డైలీ పలుకరిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ వర్షాకాలంలో ఈవీ వాహనాలను సరైన విధంగా భద్రపర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో చేసే చిన్నచిన్న తప్పులు స్కూటర్ విషయంలో చాలా పెద్దవిగా మారతాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాల సీజన్‌లో మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రక్షించడానికి, నిర్వహించడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
Updated on: Jul 04, 2024 | 5:00 PM

ఎల్లప్పుడూ మీ స్కూటర్‌ను వర్షం నుంచి దూరంగా ఉంచడానికిప్రయత్నించాలి. ముఖ్యంగా వర్షంలో ప్రయాణాన్ని నివారించడండి. అలాగే వర్షం నుండి రక్షించడానికి మీ స్కూటర్‌ను మంచి ప్రదేశంలో పార్క్ చేయాలి.

వర్షం పడిన తర్వాత మీ స్కూటర్‌ను పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టాలి. బ్రేకులు, విద్యుత్ కనెక్షన్లను పొడిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నీరు, ధూళి పేరుకుపోకుండా మడ్‌గార్డ్‌లు, టైర్లను శుభ్రం చేయాలి.

తప్పనిసరి పరిస్థితుల్లో వర్షంలో ప్రయాణించాల్సి వస్తే మీ స్కూటర్ల టైర్లు సరిగ్గా ఉన్నాయో? లేదో? తనిఖీ చేయాలి. బ్రేకులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి తరచుగా వాటిని తనిఖీ చేయాలి. ఎందుకంటే వర్షం వల్ల బ్రేక్ సిస్టమ్‌లోకి ధూళి, నీరు వెళ్తే అది వాహన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఈవీ స్కూటర్ బ్యాటరీ, మోటార్ వాటర్‌ప్రూఫ్ చేయడానికి సరైన కవరింగ్‌లు, సీలింగ్‌ని ఉపయోగించాలి. బ్యాటరీ కంపార్ట్‌మెంట్ పొడిగా, సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.

వర్షం సమయంలో విజిబిలిటీ తరచుగా తగ్గిపోతుంది. కాబట్టి మీ స్కూటర్‌లోని అన్ని లైట్లు, సిగ్నల్‌లు సరిగ్గా పని చేస్తున్నాయని ధ్రువీకరించుకోవాలి. ముఖ్యంగా వర్షంలో నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. ఆకస్మిక బ్రేకింగ్‌ను నివారించారు. జారే రోడ్లపై జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటితో నిండిన ప్రాంతాలను నివారించడం ఉత్తమం.




