
మీ దగ్గరున్న డబ్బును ఇవ్వెస్ట్ చేసి జీరో రిస్క్‌తో మంచి ఆదాయం పొందాలని అనుకుంటే.. పోస్టాఫీస్ కూడా టైమ్ డిపాజిట్ (TD) బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఒక స్థిరకాల పొదుపు పథకం. మీరు ఒక నిర్దిష్ట కాలానికి డబ్బు డిపాజిట్ చేస్తే, ఆ మొత్తంపై స్థిర వడ్డీ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి జీరో రిస్క్. మీ డబ్బు భద్రంగా ఉంటుంది.

పోస్టాఫీస్ TD ఖాతా 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితులతో ఉంటుంది. ప్రస్తుతం 2 సంవత్సరాల TD ఖాతాకు 7 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ రేటు ప్రకారం మీరు రూ.4 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.4,59,552 లభిస్తుంది. అంటే వడ్డీ రూపంలోనే దాదాపు రూ.60 వేలు అదనంగా పొందవచ్చు.

పోస్టాఫీస్ TD ఖాతాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రధాన పెట్టుబడి లేదా వడ్డీ నష్టం ఉండదు. బ్యాంకు FDల మాదిరిగా, TD ఖాతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. వృద్ధులు, గృహిణులు, ఉద్యోగులు వంటి ప్రతి వర్గానికి ఇది మంచి పెట్టుబడి పథకంగా చెప్పొచ్చు.

ఈ అకౌంట్‌లో మీరు కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. మీ అవసరానికి అనుగుణంగా పెంచుకోవచ్చు. 1, 2, 3, లేదా 5 సంవత్సరాల కాలపరిమితుల్లో మీకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవచ్చు. TD ఖాతా తెరిచిన వెంటనే, మెచ్యూరిటీ మొత్తాన్ని ముందే తెలుసుకోవచ్చు. అన్ని వయసుల వారికి అనుకూలం. చిన్న, మధ్యస్థాయి లేదా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి చేయవచ్చు.

పోస్టాఫీస్ TD ఖాతా పెట్టుబడిదారులకు భద్రత, స్థిర లాభం, ప్రభుత్వ హామీ అన్న మూడు ప్రయోజనాలను కలిపి ఇస్తుంది. రూ.4 లక్షలు పెట్టుబడి చేస్తే, మీరు రెండు లేదా ఐదు సంవత్సరాల తర్వాత మంచి వడ్డీతో కూడిన మొత్తం పొందవచ్చు. బ్యాంకు FDలతో పోల్చితే కొంచెం ఎక్కువ వడ్డీ, అలాగే ప్రభుత్వం నేరుగా హామీ పోస్టాఫీస్ TD ఖాతాను ప్రత్యేకంగా చేస్తుంది.