Post Office: ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే డబుల్ రిటర్న్!

Updated on: Sep 09, 2025 | 7:25 AM

Post Office: ఈ పథకంలో పెట్టే పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం ఉండదు. మార్కెట్ లాగా మీ డబ్బు హెచ్చుతగ్గుల వల్ల ప్రభావితం కాదు. సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే, స్థిర రాబడిని ఆశించే వారికి ఇది సరైన ఎంపిక. ఈ పథకంపై వచ్చే..

1 / 5
Post Office Scheme: మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉండాలని, వేగంగా వృద్ధి చెందాలని మీరు కోరుకుంటే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం మీకు గొప్ప అవకాశంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ పథకం మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా స్థిర వడ్డీతో మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. అంటే మీరు ఈ పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే దాదాపు 115 నెలల్లో ఈ మొత్తం రూ. 20 లక్షలు అవుతుంది. ఈ స్కీ్‌మ్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2 / 5
కిసాన్ వికాస్ పత్రలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దాని చక్రవడ్డీ. అంటే మీరు ప్రతి సంవత్సరం పొందే వడ్డీ మీ ప్రిన్సిపల్‌కు జోడిస్తారు. తద్వారా తదుపరిసారి మీరు ఆ కొత్త పెద్ద మొత్తానికి వడ్డీని పొందుతారు. ఉదాహరణకు మీరు రూ. 10,00,000 పెట్టుబడి పెడితే మొదటి సంవత్సరం తర్వాత మీకు 7.5% వడ్డీ అంటే రూ. 75,000 వస్తుంది. ఈ రూ. 75,000 మీ అసలు రూ.10,00,000 కు జోడిస్తారు. అంటే ఇప్పుడు మీ కొత్త పెట్టుబడి రూ. 10,75,000 అవుతుంది. అదేవిధంగా వచ్చే ఏడాది ఆ రూ. 10,75,000 పై వడ్డీ వస్తుంది. ఇది నిరంతరం కొనసాగుతుంది. దాదాపు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బు రూ. 20,00,000కు రెట్టింపు అవుతుంది.

3 / 5
ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఉద్యోగార్థులైనా, వ్యాపారవేత్త అయినా గృహిణి అయినా ప్రతి ఒక్కరూ KVP ఖాతాలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, తల్లిదండ్రులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తమ పిల్లల పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కుటుంబంలోని ప్రతి సభ్యునికి సురక్షితమైన పొదుపు సాధనంగా ఉంటుంది.

4 / 5
మీరు కిసాన్ వికాస్ పత్ర యోజనలో కేవలం రూ.1000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. అంటే మీరు మీకు కావలసినంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. ఇది మీ పొదుపులను వేర్వేరు ఖాతాలుగా విభజించుకునే సౌకర్యాన్ని కూడా మీకు అందిస్తుంది.

5 / 5
కిసాన్ వికాస్ పత్ర యోజన ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందుకే దీనిలో పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం ఉండదు. మార్కెట్ లాగా మీ డబ్బు హెచ్చుతగ్గుల వల్ల ప్రభావితం కాదు. సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే, స్థిర రాబడిని ఆశించే వారికి ఇది సరైన ఎంపిక. ఈ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనాన్ని అందించనప్పటికీ దాని హామీ, స్థిరత్వం దీనిని నమ్మదగిన పథకంగా చేస్తాయి.