
భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్.. వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం ప్రయోజనాలను రైతులకు అందుతాయి.



అయితే ఇటీవల 19వ విడత డబ్బులు విడుదల కాగా, 20వ విడత డబ్బులు విడుదల కావడానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

అయితే పీఎం కిసాన్ స్కీమ్ పథకం ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ లేనివారికి డబ్బులు అందవని గుర్తించుకోండి. పూర్తి కేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేస్తుంది. అందుకే కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం మీ దగ్గరలోని మీ సేవ కేంద్రం, లేదా ఏదైనా ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లి కూడా కేవైసీ చేసుకోవచ్చు.