
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో 23వ విడత నిధులను విడుదల చేయగా.. 24వ విడత నిధుల విడుదలపై చర్చ నడుస్తోంది. తర్వాతి విడత డబ్బులు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. 24వ విడత సొమ్ము జమపై క్లారిటీ వచ్చేసింది.

లబ్దిదారుల అకౌంట్లో రూ. 2 వేల చొప్పున అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రతీ ఏడాది మూడు విడతలుగా వీటిని కేంద్రం జమ చేస్తోంది. వీటిని నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తోంది. ఈ పథకం కింద లబ్ది పొందాలంటే ఏం చేయాలి..? ఏయే పనులు పూర్తి చేయాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పీఎం కిసాన్ లబ్దిదారులు నిధులు అందుకోవాలంటే ఈకేవైసీ(e-KYC) తప్పనిసరిగా పూర్తి చేయాలి. జస్ట్ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ పని సులువుగా పూర్తి చేయవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

ఇక సాగు భూమి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. భూమి రికార్డులను ఒకసారి పరిశీలించుకుని తప్పులు ఏమైనా ఉంటే అప్డేట్ చేయించుకోవాలి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోవడం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసుకోవడం ముఖ్యం. 23వ విడత నగదు జూన్‌లో విడుదలైంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందిస్తుండగా.. 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశముంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ పేమెంట్ హిస్టరీని పరిశీలిస్తే అక్టోబర్‌లో ఖచ్చితంగా జమ చేసే అవకాశముంది. దీంతో రైతులు ఈ నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రాబోయే విడత నగదు అందుకోవాలంటే ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి.