Restaurant on Wheels: భోజన ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో రైలు కోచ్‌లో రెస్టారెంట్.. ఎక్కడంటే..?

|

Jul 24, 2023 | 6:28 PM

హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో "పరీవార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్" పేరుతో "రెస్టారెంట్ ఆన్ వీల్స్"ను ప్రారంభమైంది. ఇందులో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మొఘలాయి, చైనీస్ మొదలైన అనేక రకాల రుచికరమైన వంటకాలను అందిస్తున్నారు.

1 / 7
కాచిగూడ రైల్వే స్టేషన్‌ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. భోజన ప్రియులను ఆకట్టుకోవడానికి "రెస్టారెంట్ ఆన్ వీల్స్"ను ప్రారంభించింది. ఆహార ప్రియులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని అందించడం ద్వారా వారికి వినూత్న అనుభూతిని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో “రెస్టారెంట్ ఆన్ వీల్స్”ను మొదలుపెట్టింది.

2 / 7
హైదరాబాద్ డివిజన్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సర్క్యులేటింగ్ ఏరియాలో తన మొదటి "రెస్టారెంట్ ఆన్ వీల్స్"ని తీసుకొచ్చింది. "పరీవార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్" పేరుతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. రెస్టారెంటు ఆన్ వీల్స్ రెండు పాతబడిన హెరిటేజ్ కోచ్‌లను పునరుద్ధరించడం ద్వారా అభివృద్ధి చేయబడింది.

3 / 7
ఇది రైలు పట్టాలపై అమర్చిన కోచ్ లోపల డైనర్లకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని సోమవారం రైల్వే అధికారి తెలిపారు. ఇది ఈ ప్రాంతంలో ల్యాండ్‌మార్క్ ఈటింగ్ హౌస్‌గా మారుతుందన్నారు. భోజన ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే ఈ రెస్టారెంట్ చక్కటి ప్రదేశంగా ఉంటుందని వెల్లడించారు.

4 / 7
కాచిగూడ రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉండే రైల్వే టెర్మినల్స్‌లో ఒకటి.. చాలా మంది ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రైలు ప్రయాణికులు ఉంటారు. ప్రజలకు మరిన్ని ఆహార ఎంపికలను అందించడానికి.. కోచ్ రెస్టారెంట్ అనే నవల భావనను పరిచయం చేయడానికి కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంపిక చేయబడింది.

5 / 7
ఇది నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మొఘలాయి, చైనీస్ మొదలైన అనేక రకాల రుచికరమైన మెనూ ఈ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉన్నాయి. కోచ్ రెస్టారెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం సర్క్యులేటింగ్ ప్రాంతానికి సమీపంలో ఏర్పాటు చేశారు.

6 / 7
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో హెరిటేజ్ కోచ్‌లను వినియోగించుకుని ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు “రెస్టారెంట్ ఆన్ వీల్స్”ను తీసుకొచ్చిన హైదరాబాద్ డివిజన్ అధికారులు, సిబ్బందిని SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, జనరల్ మేనేజర్ అభినందించారు.

7 / 7
రైలు ప్రయాణికులు, ప్రయాణికులు, సాధారణ ప్రజలకు పరిశుభ్రత, నాణ్యతతో కూడిన ఆహారం, పానీయాల కోసం దీనిని తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఈ సేవలను ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం రౌండ్-ది-క్లాక్ అందించడానికి రైల్వేలు అనుమతించాయి.