
Bike24: సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేవారికి ఎన్నో మార్గాలున్నాయి. బైక్24 ప్రస్తుతం స్పోర్ట్స్ బైకులను అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్ బైకులు రూ.75 వేల నుంచే అమ్మకానికి వచ్చాయి.

బైక్24 వెబ్‌సైట్‌లోనే సమాచారం ప్రకారం.. కేటీఎం డ్యూక్ 200 బైక్ కేవలం రూ.75 వేలకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 2016 మోడల్. ఈ బైకు ఇప్పటి వరకు 31 వేల కిలోమీటర్లు తిరిగింది. ఉచితంగా డెలివరి సదుపాయం ఉంది.

మార్కెట్‌లో ఈ బైకు అసలు ధర రూ.1.80 లక్షలుగా(ఎక్స్-షోరూం) ఉంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ బైకును కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా తక్కువ ధరలో బైక్‌లను కొనుగోలు చేయవచ్చు. బైక్‌లకు ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది.

ఈ బైకు మాత్రమే కాక, కేటీఎం ఆర్‌సీ 2019 మోడల్ కూడా లక్ష రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. మరో స్పోర్ట్స్ బైకు కేటీఎం ఆర్‌సీ 200, 2017 మోడల్ కేవలం రూ.99 వేలకే లభిస్తోంది. అమ్మకానికి వచ్చిన ఈ బైకు 23 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. బైక్24 వెబ్‌సైట్‌లో చాలా స్పోర్ట్స్ బైకులు అత్యంత తక్కువ ధరలకే అమ్మకానికి వచ్చాయి.