Online Gaming: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. ఏది అనుమతి? ఏది నిషేధం? గేమర్లకు ఇవి తప్పనిసరి!

Updated on: May 01, 2026 | 9:53 AM

New Online Gaming Rules: డబ్బులతో కూడిన బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్స్‌లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి గేమ్‌లపై భారత్‌లో నిషేధించారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. తాజాగా ఆన్‌లైన్ గేమింగ్స్‌కు సంబంధించిన నిబంధనలను..

1 / 5
 Online Gaming Rul: నేటి (మే 1, 2026) నుండి భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. గేమింగ్ పరిశ్రమలో పారదర్శకతను పెంచడానికి, వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. ఈ కొత్త మార్పుల వల్ల అసలు ఏం మారబోతోంది? ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం..

2 / 5
 బెట్టింగ్, జూదం: నైపుణ్యంతో సంబంధం లేకుండా, కేవలం అదృష్టం మీద ఆధారపడి డబ్బులు పందెం కాసే (Wagering) గేమ్‌లపై కఠిన నిషేధం ఉంటుంది. అలాగే విదేశీ బెట్టింగ్ సైట్లకు సంబంధించిన ప్రకటనలు లేదా వాటికి ప్రచారం కల్పించే ప్లాట్‌ఫారమ్‌లపై చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించని యాప్స్: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎస్ఆర్ఓ (SRO)ల ద్వారా ధృవీకరించని గేమింగ్ యాప్‌లు భారత్‌లో పనిచేయడానికి వీలుండదు. నైపుణ్యం కలిగిన క్రీడలు: కేవలం అదృష్టం కాకుండా, ఆటగాడి ప్రతిభ, వ్యూహం అవసరమయ్యే గేమ్‌లకు అనుమతి ఉంటుందని ఐటీ శాఖ సెక్రెటరీ ఎస్ కృష్ణన్ వెల్లడించారు.

3 / 5
 ధృవీకరించబడిన గేమ్‌లు: స్వీయ నియంత్రణ సంస్థల (SRO) ద్వారా అనుమతి పొందిన గేమ్స్ మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కేవైసీ (KYC) తప్పనిసరి: రియల్ మనీ (డబ్బులతో కూడిన) గేమ్‌లు ఆడేవారు ఇప్పుడు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది మైనర్లు ఇబ్బడిముబ్బడిగా డబ్బులు ఖర్చు చేయకుండా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది.

4 / 5
 గెలుచుకున్న డబ్బుపై పన్ను: ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలుచుకున్న ప్రతి రూపాయిపై నిబంధనల ప్రకారం పన్ను (TDS) మినహాయింపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ మార్క్: ప్రతి గేమింగ్ ప్లాట్‌ఫారమ్ తాము ధృవీకరించినట్లుగా ఒక నిర్దిష్ట గుర్తును (Verification Mark) ప్రదర్శించాల్సి ఉంటుంది.

5 / 5
 ఈ మార్పు ఎందుకు?: భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. అయితే దీనివల్ల యూజర్లు ఆర్థికంగా నష్టపోకుండా, వ్యసనాలకు బానిసలు కాకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా పారదర్శకమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించడం ఈ రూల్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం.

Loading...
Unable to load recommendations.
Follow Us