LPG: గ్యాస్‌ బుకింగ్‌.. మే 1 నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్‌! తెలుసుకోకుంటే ఇబ్బందే!

Updated on: Apr 30, 2026 | 8:10 AM

ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, భారతదేశంలో LPG కొరతను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మే 1, 2026 నుండి ఐదు కొత్త నిబంధనలను అమలు చేయనుంది. డిజిటల్ బుకింగ్, డెలివరీ DAC, బుకింగ్ మధ్య గ్యాప్, PNG-LPG రెండూ వద్దు, e-KYC తప్పనిసరి.

1 / 5
అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఆయిల్, గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు మూతపడగా, సామాన్య వినియోగదారులు సిలిండర్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మే 1, 2026 నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సంబంధించి ఐదు కీలక నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది.

2 / 5
మొదటిగా గ్యాస్ బుకింగ్ విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేయడం ద్వారా వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించనున్నారు. ఇకపై గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ సేవల విస్తరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు.

3 / 5
రెండవ మార్పు భద్రతకు సంబంధించినది. డెలివరీ సమయంలో వినియోగదారుల గుర్తింపు కోసం డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విధానాన్ని తప్పనిసరి చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు, వినియోగదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మాత్రమే సిలిండర్ అందజేస్తారు. అందుకే మొబైల్ నంబర్ అప్డేట్ చేయడం అత్యంత అవసరం.

4 / 5
మూడవ నిబంధనగా సిలిండర్ బుకింగ్‌ల మధ్య గ్యాప్‌ను నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తర్వాత మరొకటి బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధిని 45 రోజులుగా నిర్ణయించారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. నాలుగవ కీలక మార్పు ప్రకారం, ఒకే ఇంట్లో పైప్ గ్యాస్ (PNG), ఎల్పీజీ రెండూ ఒకేసారి ఉపయోగించడానికి అనుమతి ఉండదు. ఇప్పటికే రెండు కనెక్షన్లు ఉన్నవారు వాటిలో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనెక్షన్ రద్దు చేసే అవకాశముంది.

5 / 5
చివరిగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేశారు. వినియోగదారులు తమ ఆధార్ లేదా బయోమెట్రిక్ వివరాలతో కేవైసీ పూర్తి చేయకపోతే, గ్యాస్ బుకింగ్ చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా సబ్సిడీ కూడా నిలిపివేయబడుతుంది. అందువల్ల ప్రతి వినియోగదారుడు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం అత్యవసరం. ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల భద్రతను పెంచడంతో పాటు, సరఫరా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Follow Us