
Electric Cars: టిగోర్ జిప్ట్రాన్ కాంపాక్ట్ సెడాన్ (Tigor Ziptron): టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారులో 26 kWh బ్యాటరీ అమర్చింది కంపెనీ. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో సుమారు 306 కిమీల వరకు ప్రయాణిస్తుంది. 15 ఆంపియర్ వాల్ అడాప్టర్‌ని ఉపయోగించారు. ఈ కారును 80 శాతానికి ఛార్జ్ చేయడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. అయితే డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని గంటలోపు 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Kona EV) తొలిసారిగా భారత మార్కెట్లో విడుదలైంది. 39.2 kWh బ్యాటరీని ఉపయోగించింది కంపెనీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒక గంటలోపు 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని రూ. 23.79 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుంది.

దేశంలో ఎంజీ జడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కారు ( MG). దీనిని 2021లో మైనర్ అప్‌డేట్ చేశారు. ఈ కారు 44-kwh బ్యాటరీతో వస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌తో 419 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జడ్‌ఎస్ ఎలక్ట్రిక్ సాధారణ 15 amp వాల్ సాకెట్‌ను ఉపయోగించింది కంపెనీ. ఈ కారు 50 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 20.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు (Tata Nexon EV): టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్. నెక్సాన్ 30.2 kWh బ్యాటరీతో శక్తిని అందిస్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీని కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.