Maruti Swift: కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

|

May 10, 2024 | 9:41 PM

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చెందిన స్విఫ్ట్‌ మోడల్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ఇండియాలో బెస్ట్‌ కార్లలో నిలిచిందీ కారు. భారీ అమ్మకాలతో రికార్డు సృష్టించిన స్విఫ్ట్‌ నుంచి కొత్త మోడల్‌ వచ్చేసింది. స్విఫ్ట్‌ ఫోర్త్‌ జనరేషన్‌ కారును కంపెనీ గురువారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? ధర ఎంత ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న స్విఫ్ట్‌ కొత్త కారు వచ్చేసింది. స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారుకు సంబంధించి ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. రూ. 11 వేలు చొల్లించి టోకెన్‌ సొమ్ము చెల్లించి ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకుంటే.. నెల రోజుల్లో డెలివరీ ఇస్తుంది.

2 / 5
ఈ కారులో జడ్-సిరీస్ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. భద్రతకు పెద్ద పీట వేసిన ఈ కారులో 6-ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు అడాస్ తరహా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించారు. ఈ కొత్త కారు ధర విషయానికొస్తే ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ రూ. 6.3 లక్షల నుంచి ప్రారంభంకానుంది.

3 / 5
ఇక ఈ కొత్త స్విఫ్ట్‌ కారు ఫ్రంట్‌లో ప్రొజెక్టర్ సెటప్‌తోపాటు హెడ్ ల్యాంప్స్ షార్ప్‌ లుక్స్‌తో డిజైన్‌ చేశారు. హియర్ టెక్ ప్లాట్ ఫామ్ ఆధారంగా ఈ కొత్త కారును డిజైన్‌ చేశారు. ఇక 16 ఇంచెస్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

4 / 5
మారుతి కొత్త స్విఫ్ట్‌లో స్లీక్ ఏసీ వెంట్స్, హెచ్ వీఏసీ కంట్రోల్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

5 / 5
కొత్త స్విఫ్ట్‌ ఇంజిన్ గరిష్టంగా 90 హెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, సీఎన్జీ, హైబ్రీడ్ ఇంజన్‌ వేరియంట్స్‌లో ఈ కారును తీసుకొచ్చారు. 360-డిగ్రీ కెమెరా, డ్యుయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు.