కొన్నిసార్లు డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లినప్పుడు.. మనం అందులో నమోదు చేసిన మొత్తం అకౌంట్ నుంచి కట్ అవుతుంది. కానీ ఏటీఎం నుంచి డబ్బులు రావు. అలాంటప్పుడు రెండు లేదా మూడు పనిదినాల్లో మళ్లీ అవి మన ఖాతాలోకి తిరిగి జమ అవుతాయి. లేదంటే సంబంధిత బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
*ATMలో డబ్బు విత్‌డ్రా కాకపోతే ఏం చేయాలి*.. మొదటిగా మీరు ఏటీఎం కార్డు జారీ చేసిన బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి లావాదేవీలు చేసినా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు.
*బ్యాంకు ఎన్ని రోజుల్లో ఫిర్యాదును పరిష్కరిస్తుంది?* - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశం ప్రకారం, ఫిర్యాదు అందుకున్న గరిష్టంగా 12 పనిదినాల్లో బ్యాంకులు మీ సమస్యను పరిష్కరిస్తాయి.
*12 రోజుల్లోపు ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే ఏమి చేయాలి?*- ఫిర్యాదును స్వీకరించిన 12 రోజుల్లోగా డబ్బులు అకౌంట్‌లో పడకపోతే.. ప్రతీ రోజూ ఖాతాదారుడి అకౌంట్‌లో రూ. 100 జమ చేయాల్సి ఉంటుంది. జూలై 01, 2011 నుండి ఈ రూల్ అమలులో ఉంది. మీ ఫిర్యాదును పరిష్కరించడంలో 7 పనిదినాలకు మించి ఆలస్యం చేసినందుకు గానూ బ్యాంకులు ఈ విధంగా పెనాల్టీ చెల్లించాలి.
ఒకవేళ మీరు అభ్యర్ధించిన విధంగా డబ్బు తిరిగి రాకపోతే.. బ్యాంకులు మీ ఫిర్యాదుకు స్పందించకపోతే.. మీరు స్థానిక బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.