January Changes: గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!

|

Dec 29, 2024 | 7:51 PM

January Changes: ప్రతి నెల ప్రారంభంలో ఆధార్ కార్డు నుండి గ్యాస్ సిలిండర్ వరకు ప్రతిదానిలో కొన్ని పెద్ద మార్పులు ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్‌ నెల ముగుస్తుంది. జనవరి నెల రాబోతోంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఉద్యోగుల భవిష్య నిధి తదితర అంశాల్లో పలు మార్పులు జరుగనున్నాయి. జనవరిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరంగా చూద్దాం.

1 / 5
గ్యాస్ సిలిండర్ ధర: ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఈ పరిస్థితిలో గత కొన్ని నెలలుగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేకపోగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో జనవరిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో పెనుమార్పు ఉండొచ్చని అంటున్నారు.

2 / 5
ఉద్యోగుల భవిష్య నిధి: పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బు, ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవాలంటే ఆమోదం కోసం వేచి చూడాల్సిందే. అయితే ఇకపై అలాంటి టెన్షన్‌ ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే EPFO ​​త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఇక్కడ ఉద్యోగులు తమ ఖాతాల నుండి ఉపసంహరణలను స్వీయ-అధికారం చేసుకోవచ్చు. అంటే ఉద్యోగే స్వయంగా ఆమోదం పొందేలా చేసుకోవచ్చు.

3 / 5
కార్ల ధర పెంపు: జనవరి నుంచి కొత్త కారు కొనాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అంటే, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా సహా ప్రధాన కంపెనీలు తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచబోతున్నాయి. దీని కారణంగా వచ్చే జనవరి నుంచి కారు ధర పెరిగే అవకాశం ఉంది.

4 / 5
అమెజాన్ ప్రైమ్: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో చాలా కొత్త రూల్స్ మారనున్నాయి. అంటే మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని ఉపయోగించి రెండు టీవీలలో మాత్రమే ప్రసారం చేసుకోవచ్చు. మూడవ వ్యక్తి అదే ఖాతాను ఉపయోగించి మరొక టీవీలో ప్రసారం చేయాలనుకుంటే, అతను అదనపు సభ్యత్వాన్ని చెల్లించాలి.

5 / 5
UPI మనీ లావాదేవీ: UII 123 చెల్లింపు లావాదేవీ పరిమితి పెంచింది. గతంలో UPI 123 పే రూ.5,000కే పరిమితం కాగా, ఇప్పుడు దాన్ని రూ.10,000కు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది.