
Train General Coach: రైలులో జనరల్ కోచ్‌లలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే జనరల్ బోగీలు ఎప్పుడు కూడా ముందు, చివర మాత్రమే రెండు బోగీలు ఉంటాయి. మరి మధ్యలో ఎందుకు ఉండవో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ కోచ్‌లను రైలు మధ్యలో ఉంచితే, అదనపు బరువు మొత్తం రైలు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముందు, వెనుక కోచ్‌లు ఉన్నందున బరువు సమానంగా బ్యాలెన్స్ అవుతుంది. దీంతో రైలు సురక్షితంగా నడుస్తుంది.

రద్దీ నిర్వహణ: జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కంపార్ట్‌మెంట్‌లు రెండు చివర్లలో విభజించినందున ప్లాట్‌ఫారమ్‌పై ఒకే చోట రద్దీ ఉండదు. ఇది ప్లాట్‌ఫారమ్ మధ్యలో బరువు తక్కువగా ఉండటం వల్ల రైలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇతర ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి సులభతరం చేస్తుంది.

బోర్డింగ్, దిగే సౌకర్యాలు: జనరల్ కంపార్ట్‌మెంట్ మధ్యలో ఉంటే రద్దీ కారణంగా రిజర్వ్ చేసిన కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులకు, కంపార్ట్‌మెంట్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు రైల్వే సిబ్బందికి అంతరాయం ఏర్పడవచ్చు. కంపార్ట్‌మెంట్ చివరిలో ఉన్నందున ఈ అమరిక సజావుగా ఉంటుంది.

గార్డు నిఘా: రైలు చివర జనరల్ కంపార్ట్‌మెంట్ ఉండటం వల్ల గార్డు మొత్తం రైలును, ప్రయాణికుల కదలికలను గమనించడం సులభం అవుతుంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

ప్రత్యేక సీటింగ్ అమరిక: జనరల్ కోచ్‌ల ఇంటీరియర్ డిజైన్, సీటింగ్ అమరిక ఇతర కోచ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోచ్‌లు మధ్యలో లేనందున ప్రయాణికుల ప్రవాహాన్ని నియంత్రించడం రైల్వే పరిపాలనకు సులభం అవుతుంది.