
వందే భారత్ ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన జారీ చేసింది. వందే భారత్ టైమింగ్స్‌లో కీలక మార్పులు చేసింది. మార్చి 15వ తేదీ నంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా నడిచే వందే భారత్ రైళ్ల టైమ్ షెడ్యూల్స్‌ను అధికారులు సవరించారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మెరుగైన సేవలు అందించేందుకు షెడ్యూల్స్‌ను మార్చినట్లు రైల్వేశాఖ తన ప్రకటనలో తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాచిగూడ-యశ్వంత్ పూర్, కలబుర్గి-బెంగళూరు మధ్య నడిచే రైళ్ల షెడ్యూల్స్‌లో మార్పులు జరిగాయి. కాచిగూడ-యశ్వంత్ పూర్(20703) రైలు హిందూపురం స్టేషన్‌కు వచ్చే టైమింగ్స్‌ను మార్చారు. ఇంతకముందు సమయం కంటే కాస్త ఆలస్యంగా హిందూపూర్‌కు చేరుకోనుంది.

ఇక యశ్వంత్ పూర్-కాచిగూడ(20704) తిరుగు ప్రయాణంలో హిందూపూర్ స్టేషన్‌కు చేరుకునే సమయం కూడా మారింది. దీంతో ప్రయాణికులు కొత్త టైమింగ్స్‌ను చెక్ చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. కలబుర్గి – SMVT బెంగళూరు (22231) ట్రైన్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌కు వచ్చే సమయంలో కూడా మార్పులు జరిగాయి.

SMVT బెంగళూరు-కలబుర్గి ట్రైన్(22232) యలహంక స్టేషన్‌కు వచ్చే టైమ్‌లో మార్పులు జరిగాయి. గతంలో కంటే ఇది ఆలస్యంగా యలహంక స్టేషన్‌కు చేరుకుంటుంది. ప్రయాణికులు రైల్వేశాఖ వెబ్ సైట్స్, యాప్స్ ద్వారా సవరించిన సమయాలను చెక్ చేసుకోవాలి. ఇక ఈ ట్రైన్ గతంలో తరహాలోనే వారానికి ఆరు రోజులు సర్వీసులు అందిస్తోంది.

రైళ్ల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు స్టేషన్లల్లో రద్దీని మేనేజ్ చేయడంలో భాగంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యా్ప్తంగా 164 వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ఇక త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.