TDS on cash withdrawals: క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే.. సెక్షన్ 194 ఎన్ నిబంధనలు ఇవే

| Edited By: Shaik Madar Saheb

Nov 23, 2024 | 9:45 PM

దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో భాగంగా వివిధ నిబంధనలు అమలు చేస్తోంది. డిజిటల్ విధానంలో చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఆదాయపు పన్నును లెక్కించడం కూడా చాలా సులభమవుతుంది. బ్లాక్ మనీ చెలామణీని అరికట్టవచ్చు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 194 ఎన్ ను తీసుకువచ్చారు. దీని ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, సహకార సంస్థలు, పోస్టాఫీసుల నుంచి నిర్ణీత పరిమితికి మించి నగదు ఉపసంహరణ జరిగితే టీడీఎస్ వసూలు చేస్తారు.

1 / 5
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 యూనియన్ బడ్జెట్ లో సెక్షన్ 194 ఎన్ ను ప్రవేశపెట్టారు.  నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు దీన్ని తీసుకువచ్చారు. ఈ ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసిన వారికి టీడీఎస్ వర్తిస్తుంది. మరికొన్ని సందర్బాల్లో అంతకంటే తక్కువ విత్ డ్రా చేసినా వసూలు చేస్తారు.

2 / 5
ఐటీఆర్ సక్రమంగా ఫైల్ చేసిన వారు కోటి రూపాయలకు మించి నగదును తీసుకుంటే కేవలం రెండు శాతం టీడీఎస్ కడితే సరిపోతుంది. మూడేళ్లు ఫైల్ అందించని వారి నుంచి రూ.20 లక్షలకు మించితే రెండు శాతం, కోటి రూపాయలు దాటితే ఐదు శాతం వసూలు చేస్తారు.

3 / 5
ఒక వ్యక్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు మూడేళ్ల పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్న్ దాఖలు చేయకపోయినా వర్తిస్తారు. అలాంటి వారు రూ.20 లక్షల నుంచి రూ.కోటి మధ్య విత్ డ్రా చేస్తే రెండు శాతం, కోటి రూపాయలకు మించితే ఐదు శాతం చెల్లించాలి.

4 / 5
ఆదాయానికి సంబంధించిన పన్నును మూలం వద్దే వసూలు చేస్తే విధానాన్ని ట్యాక్స్ డిడెక్టెట్ ఎట్ సోర్స్ (టీడీఎస్) అంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని 194 ఎన్ సెక్షన్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి కంటే ఎక్కువ నగదును ఉపసంహరిస్తే రెండు శాతం చొప్పుడు టీడీఎస్ ను మినహాయిస్తారు.

5 / 5
ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నగదు ఉపసంహరణలు కోటి రూపాయలు దాటితేనే 194 ఎన్ సెక్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒకసారి రూ.99 లక్షలు, మరో సారి రూ.1.50 లక్షలు విత్ డ్రా చేశారనుకుందాం. ఆ మొత్తం కోటి రూపాయలు దాటి రూ.50 వేలు అయ్యింది. కోటి వరకూ మినహాయింపు ఉంటుంది కాబట్టి ఆపైన ఉన్న రూ.50 వేలకు మాత్రమే టీడీఎస్ వసూలు చేస్తారు.