
మారుతీ సుజుకీ ఆల్టో కే10.. ఈ కారుపై డైరెక్ట్ నగదు తగ్గింపు రూ. 40,000తో పాటు ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 15,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 7,000 కలిపి మొత్తం రూ. 62,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. అయితే ఆఫర్ ఏఎంటీ వేరియంట్ పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో మాన్యువల్, సీఎన్జీ వేరియంట్లను కొనుగోలు చేయాలంటే ఈ నగదు తగ్గింపులు రూ. 35,000లకు తగ్గుతాయి. అయితే ఎక్స్ చేంజ్ బోసన్, కార్పొరేట్ బోనస్ లు మాత్రం అదే విధంగా ఉంటాయి. ఈ కారు ధర రూ. 3.99లక్షల నుంచి రూ. 5.96లక్షల (ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో.. ఈ కారుపై నగదు తగ్గింపు రూ. 40,000 వరకు ఉంటుంది. అలాగే ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 15,000, కార్పొరేట్ బోనస్ రూ. 6,000 వరకూ ఉంటాయి. మొత్తం కలిపి రూ. 61,000 వరకూ తగ్గుతుంది. ఈ తగ్గింపులు ఏఎంటీ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇతర వేరియంట్లపై నగదు తగ్గింపు రూ. 35,000 మాత్రమే ఉంటుంది. ఇతర ఎక్స్ చేంజ్, కార్పొరేట్ ఆఫర్లు అలాగే వస్తాయి. ఈ ఎస్-ప్రెసో ధర రూ. 4.27 లక్షల నుండి రూ. 6.12 లక్షల(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది.

మారుతి ఈకో.. ఈ కారు పై నగదు తగ్గింపు రూ. 15,000 వరకు, ఎక్స్ చేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.4,000 కలిపి మొత్తం రూ. 29,000 వరకూ ప్రయోజనాలు పొందొచ్చు. కేవలం పెట్రోల్ వేరియంట్ పై మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సీఎన్జీ వేరియంట్ పై అయితే రూ. 10,000 వరకూ నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు అలాగే ఉంటాయి. ఈ ఈకో కారు ధరలు రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల(ఎక్స్ షోరూం) వరకు ఉంటాయి.

మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఈ కారు ఏఎంటీ వేరియంట్ పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 5000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 7000 కార్పొరేట్ తగ్గింపు కలిపి మొత్తం రూ. 42,000 వరకూ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ట్రేడ్ చేస్తున్న కారు ఏడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటేనే అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదే సమయంలో మాన్యువల్ వేరియంట్‌లను కొనుగోలు చేస్తే, నగదు తగ్గింపు రూ. 10,000 వరకు వస్తుంది. స్విఫ్ట్ సీఎన్జీ కేవలం రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపుతో లభిస్తోంది. స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ కోసం, వినియోగదారులు రూ. 23,400 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికీ రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. స్విఫ్ట్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల(ఎక్స్ షోరూం) వరకు ఉంది.

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్.. ఈ కారు ఏఎంటీ వేరియంట్ పై రూ. 35,000 వరకూ నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 6000 కార్పొరేట్ బోనస్ కలిపి మొత్తం రూ. 61,000 వరకూ ప్రయోజనాలు లభిస్తాయి. లభిస్తోంది. అదే సమయంలో దీని మాన్యువల్ వేరియంట్‌లు రూ. 30,000 నగదు తగ్గింపుతో వస్తాయి. అయితే సీఎన్జీ ట్రిమ్‌ల పై మాత్రం రూ. 15,000 క్యాష్ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ మారవు. దీని అసలు ధరలు రూ. 5.55 లక్షల నుంచి రూ. 7.38 లక్షల(ఎక్స్ షోరూం) వరకు ఉంది.

మారుతీ సుజుకీ డిజైర్.. ఈకారుపై ఏఎంటీ వేరియంట్ పై రూ. 15,000 నగదు తగ్గింపు, ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 15,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 7,000 మొత్తం కలిపి రూ. 37,000 వరకూ వస్తాయి. మాన్యువల్ వేరియంట్లపై నగదు తగ్గింపు రూ. 10,000 మాత్రమే ఉంటాయి. మిగిలిన తగ్గింపు యథావిధిగా ఉంటాయి. దీని వాస్తవ ధరలు రూ.6.57 లక్షల నుంచి రూ.9.39 లక్షల(ఎక్స్ షోరూం) మధ్య ఉంది.

మారుతీ సుజుకీ సెలెరియో.. ఈ కారు పై రూ. 40,000 వరకూ డైరెక్ట్ క్యాష్ తగ్గింపు ఉంటుంది. ఎక్స్ చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ తగ్గింపు రూ.6,000తో కలిపి మొత్తం రూ. 61,000 వరకూ ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇవి ఏఎంటీ వేరియంట్ పై మాత్రమే ఉంటాయి. మాన్యువల్, సీఎన్జీ వేరియంట్ పై పైన పేర్కొన్న ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లతో పాటు రూ. 35,000వరకూ క్యాష్ తగ్గింపును పొందొచ్చు. దీని ధరల రేంజ్ రూ.5.37 లక్షల నుంచి రూ.7.10 లక్షల(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది.