
Gold

బంగారాన్ని అమ్మే ముందు ఎంత బరువు ఉందో సరిగ్గా తెలుసుకోవాలి. అలాగే బంగారం స్వచ్ఛత కూడా తెలుసుకోవడం మంచిది. దీంతో నగలకు ఎంత డబ్బు వస్తుందో ఒక అంచనాకు రావచ్చు.

మీరు ఒకే జువెలరీ షాపులో కాకుండా రెండు మూడు షాపులకు వెళ్లి పసిడి ధర తెలుసుకోవాలి. ఎవరు ఎంత ఇస్తామని అన్నారు గమనించాలి. ఎవరు ఎక్కవ ధర ఇస్తే వారి వద్దకు వెళ్లడం ఉత్తమం. అలాగే మీ నగలపై హాల్ మార్క్ ఉంటే సులభంగానే విక్రయించవచ్చు.

మీ బంగారు అభరణాలు వేసి కొత్త నగలు కొనాలని అనుకుంటే మీరు నగలు కొన్న షాపుకే వెళ్లడం మంచిది. చాలా షాపుల వారు పాత బంగారం తీసుకుని కొత్త నగలు విక్రయిస్తుంటారు. రాళ్లు ఉన్న నగలకు తరుగు ఎక్కువ పోతుందని గమనించాలి.