Tata Electric Cars: లాంచింగ్‌కు రెడీ అయిన టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. దానితో పాటు మరో నాలుగు హై ఎండ్ కార్లు.. ఓ లుక్కేయండి..

|

May 21, 2023 | 3:35 PM

భారతీయ ఆటో ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా బ్రాండ్లు ఎలక్ట్రిక్ వేరియంట్లో తమ ఉత్పత్తులను లాంచ్ చేశాయి. ఇదే క్రమంలో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ కూడా మూడు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. టాటా టైగోర్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు మరో ఐదు కొత్త కార్లను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక్కడ విశేషమేమిటంటే దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఒకప్పుడు లాంచ్ చేసిన రూ. లక్ష కారు టాటా నానో కూడా ఈవీ వేరియంట్లో రానుంది. టాటా కంపెనీ నుంచి రానున్న ఆ ఐదు వేరియంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
టాటా సియెర్రా ఈవీ.. ఈ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ను ఆటో ఎక్స్‌పో 2020 లోనే ప్రదర్శించారు. కొత్త సిగ్మా ఆర్కిటెక్చర్ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. టాటా సియెర్రా ఈవీ రెండు వేర్వేరు వెర్షన్లలో విడుదలవుతుందని భావిస్తున్నారు. విశాలమైన ఇంటీరియర్, సొగసైన షైనింగ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది 2025 డిసెంబర్ నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ. 25 లక్షలు ఉండే అవకాశం ఉంది..

2 / 5
టాటా అవిన్య ఈవీ.. ఇది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) నుండి వచ్చే నెక్ట్స్ జెన్ ఎలక్ట్రిక్ కారు. జెన్3 ఆర్కిటెక్చర్ ప్రకారం నిర్మితమవుతోంది. అవిన్య అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది. అవిన్యా అంటే ఆవిష్కరణ అని అర్థం. దీనిలోని బ్యాటరీ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. సుమారు 30 నిమిషాల చార్జింగ్ తోనే కనీసం 500 కి.మీ పరిధిని అందిస్తుంది. దీనిని 2025 ఫిబ్రవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 30లక్షలు ఉంటుందని అంచనా.

3 / 5
టాటా హారియర్ ఈవీ.. ఒమేగా, జెన్ 2 ఆర్కిటెక్చర్ ప్రకారం దీనిని తయారు చేస్తున్నారు. దీనిలో ఆధునిక లైటింగ్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్, ఏడబ్ల్యూడీ టెక్నాలజీ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉంటాయి. ఇది ఆకర్షణీయమైన  డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఆల్-వీల్ డ్రైవ్ ను అందిస్తోంది. ఈ కారు కూడా 2025 ఏప్రిల్ నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 30లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

4 / 5
టాటా పంచ్ ఈవీ.. దీనిలో  30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, జిప్ ట్రాన్ ఈవీ పవర్‌ట్రెయిన్ ఉంటుంది. దీనిలో  పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఈ కారు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌పై 300+ కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు 2023 చివరికి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని రూ. 25లక్షలు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

5 / 5
టాటా నానో ఈవీ.. ఈ కారు17-kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. 27 hp,  68 Nm అవుట్‌పుట్ టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 120–140 కి.మీ. వెళ్తుంది. గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి  ఫీచర్లు ఉన్నాయి. సాధారణ హోమ్ ఛార్జర్‌తో, పూర్తిగా ఛార్జ్ కావడానికి 7.5 గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌తో, ఇది 75 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర సుమారు రూ. 5 నుంచి 8 లక్షలు ఉండవచ్చు. 2024 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.