Swiggy, Zomato: నేటి నుంచి అదనపు భారం.. 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు

Swiggy, Zomato: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు..

|

Updated on: Jan 01, 2022 | 1:53 PM

Swiggy, Zomato: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జోమాటో సేవలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. క్లౌడ్ కిచెన్‌లు, సెంట్రల్ కిచెన్‌లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ శనివారం నుంచి 5 శాతం సేవల పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. జీఎస్టీ పన్ను చెల్లించని రెస్టారెంట్లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం హెచ్చరించింది.

1 / 4
గతంలో రెస్టారెంట్లు స్వయంగా పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి అందించేవి. కానీ ఇప్పుడు వాటిని ట్యాక్స్‌మెన్‌కు చెల్లించే బాధ్యత డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ, జోమాటోలపై ఉంటుంది.

2 / 4
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో జాబితా చేసిన పలు రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్నప్పటికీ ఆ పన్నులను ఎగవేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

3 / 4
ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన తర్వాత డబ్బులు చెల్లించే సమయంలో జీఎస్టీ పేరిట అదనపు చార్జీలు వసూలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఐదు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కస్టమర్ల నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్న రెస్టారెంట్లు.. అందులో కొంత మొత్తం ఫుడ్‌ డెలివరీ కంపెనీలు తీసుకునేవి. ఇప్పుడు డెలివరీ సంస్థలు రెస్టారెంట్ల నుంచి తీసుకుని నేరుగా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది.

4 / 4
Follow us