
SBI Car Loan:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర వాటికి అందించే రుణాలపై వడ్డీశాతం తగ్గింపు ఇస్తూ ఆఫర్ ఇస్తోంది. ఇక తాజాగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా శుభవార్త చెప్పింది ఎస్‌బీఐ.

కారు కొనే వారికి తీపికబురు అందించింది. పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దీంతో కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది. ఎస్‌బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఆఫర్లు అందిస్తోంది. కియా కారు కొనే వారికి మాత్రమే ఆఫర్లు లభిస్తాయి. ఈ కారును కొనుగోలు చేస్తే మీకు లోన్ వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా కారు ధరకు సమానమైన మొత్తంలో బ్యాంక్ నుంచి లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్, ఈ ప్రయోజనాలన్నీ మీరు యోనో ద్వారా కారు కొనుగోలుపై లోన్ తీసుకున్నట్లయితే ఈ ప్రయోజనం పొందవచ్చు.

అయితే పలు కంపెనీలకు చెందిన కార్లపై కూడా అనేక ఆఫర్లను అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా. వివిధ రకాల కార్ల కొనుగోళ్లపై ఇప్పటికే పలు ఆఫర్లను అందిస్తోంది. తక్కువ వడ్డీ, రాయితీలు అందిస్తోంది.