
బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతూ వస్తో్న్నాయి. బ్రేక్ అనేదే లేకుండా ఆమాంతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి నెలకొంది. ఈ కారణంతో పసిడిలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్ట్ 18న ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

దేశీయ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,590 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,55,890గా ఉండగా.. మంగళవారం రూ.230 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,900 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,890 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,900 వద్ద కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,040గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,050 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,890 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,900గా ఉన్నాయి. ఇక వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతన్నాయి. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద ఉండగా.. చెన్నైలో రూ.2.55 లక్షల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. దేశంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్ మొదలైంది. దీంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. పశ్చిమాసియలో ఉద్రిక్తతలు ఒక కొలిక్కి రాకపోవడంతో పాటు హర్ముజ్ జలసంధి నియంత్రణపై స్పష్టత రావడం లేదు. బంగారం ధరల పెరుగుదలకు ఇవే కారణమవుతున్నాయి.