AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దీపావళి నాటికి భారీగా పెరగనున్న బంగారం ధరలు.! కళ్లు బైర్లు కమ్మే లెక్కలివే.. మరోసారి రికార్డ్ ధరలు..!

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. త్వరలో దసరా, దీపావళి లాంటి పండగలు వస్తున్న క్రమంలో ధరలు ఎలా ఉంటాయనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆర్ధిక విశ్లేషకులు అంచనాలు షాకింగ్‌గా మారాయి.

Venkatrao Lella
|

Updated on: Oct 01, 2026 | 4:33 PM

Share
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. డాలర్ బలపడటం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన క్రమంలో ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.49 లక్షలకు పడిపోగా.. 22 క్యారెట్ల ధర రూ.1.36 లక్షలకు డౌన్ అయింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

1 / 5
త్వరలో దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు వస్తున్న క్రమంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ధరలు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం కాగా.. రాబోయే రోజుల్లో ధరలు ఇలాగే కొనసాగుతాయా..? లేదా మళ్లీ భారీ కుదుపు ఉంటుందా? అనేది ఆర్దిక వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బంగారం ధరలపై బాంబ్ పేల్చే అంచనాలు వెలవవడుతున్నాయి.

2 / 5
దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.1.80 లక్షలకు చేరుకునే అవకాశముందని కేడియా అడ్వైజరీ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా తన అంచనాను వెల్లడించారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచడం, ఈటీఎఫ్‌ల్లో నిధుల ప్రవాహం, రూపాయి విలువ పడిపోతున్న క్రమంలో రాబోయే పండుగ రోజుల్లో ధరలు మరింత పుంజుకునే ఛాన్స్ ఉందని విశ్లేషించారు.  భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, పరిమిత సరఫరా కూడా  ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశముందని తెలిపారు.

3 / 5
ప్రస్తుతం వెండి ధరలు కూడా క్రాష్ అవుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే దీపావళి నాటికి వెండి ధరలు కూడా పెరగొచ్చని అజయ్ సురేష్ కేడియా విశ్లేషించారు. దీపావళి నాటికి కిలో వెండి రూ.3 లక్షలకు చేరుకోవచ్చని జోస్యం చెప్పారు. వెండి సరఫరాలో కొరతతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం పెరుగుతున్న క్రమంలో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు.

4 / 5
అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,240 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,800 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది. దీపావళి పండక్కి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో బంగారం ధరలు అప్పటికీ భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5 / 5
Follow Us