
Gold Price: ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి బ్యాంకు అయిన డాయిష్ బ్యాంక్, బంగారం భవిష్యత్ గమనంపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణను వెల్లడించింది. ఆ బ్యాంకు ప్రకారం.. ప్రస్తుత డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల బంగారంపై వ్యామోహం ఇలాగే కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో బంగారం ధర ఔన్సుకు $8,000 (రూ. 2.54 లక్షలు)కు చేరుకోవచ్చని వెల్లడించారు.

డాయిష్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల వ్యూహాలలో గణనీయమైన మార్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ నిల్వల్లో బంగారం వాటా సుమారు 30% ఉండగా, ఇది 40%కి పెరుగుతుందని అంచనా. భౌగోళిక రాజకీయ పరిస్థితులు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

భారత్ మార్కెట్లో ధర: అంతర్జాతీయ అంచనాల ప్రకారం.. డాలర్ విలువ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధర ఔన్సుకు $8,000.. భారత్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2.54 లక్షల వరకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ధర కంటే లక్ష వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతానికి బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది భారీ లాభాలను అందించే అవకాశం ఉందని డ్యుయిష్ బ్యాంక్ నివేదిక సూచిస్తోంది. అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఈ మార్పుకు అతిపెద్ద కారణం డాలర్‌పై విశ్వాసం తగ్గడమే. 2000వ దశకం ప్రారంభంలో ప్రపంచ నిల్వల్లో 60%కి పైగా ఉన్న డాలర్ వాటా, ఇప్పుడు సుమారు 40%కి పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని చేర్చాయి.