Gold Price Update: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

Updated on: Dec 12, 2025 | 9:51 AM

Gold Price Update: భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మ‌నంద‌రికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. తాజాగా పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా..

1 / 5
 Gold Price Update: పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా ఊహించినట్లుగానే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది.

2 / 5
 దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు ఊగిసలాటలకు గురవుతూ సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్వల్ప తగ్గుదల, తదుపరి రోజునే మళ్లీ భారీగా పెరుగుతున్న ధరలు సామాన్య కుటుంబాలకి బంగారాన్ని మరింత దూరంలోకి నెట్టేస్తున్నాయి.

3 / 5
 ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మ‌నంద‌రికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది.

4 / 5
 డిసెంబర్‌ 12 ఉదయం నమోదైన బులియన్ ధరలు పీక్స్‌కి చేరాయి.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1910 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 2 వేల రూపాయల వరకు ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ.1,32,660కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల పది గ్రాములపై రూ.1750 పెరిగి ప్రస్తుతం రూ.1,21,600 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో తులం బంగారం ధర రూ.1,32,600 వద్ద కొనసాగుతోంది.

5 / 5
 ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై కూడా భారీగా పెరిగింది. దీనిపై 3 వేల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,04000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళలో మాత్రం ఇంకా భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద ఉంది.